innerbannerimg
Farmers Success Stories

పండ్లు

 • వృథా భూముల్లో అమృత సాగు

  వృథా భూములు, రాతినేలలు కలిగి ఉన్న వారికి దిగులు అవసరం లేదు. ఆ భూముల్లోనూ తోటలు పెంచుకోవచ్చని అంటున్నారు ఉద్యాన అధికారులు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడినిచ్చే సీతాఫలాన్ని సాగు చేసుకోచ్చని సూచిస్తున్నారు. అడవులు, రాతి గుట్టల్లోనే కాకుండా పొలాల్లో అంతర పంటగా కూడా వేసుకోచ్చని చెబుతున్నారు. Click Here

ప్రత్తి

 • పలచగా పంట దిట్టంగా దిగుబడి

  ఏరువాక పౌర్ణమి వెన్నెల విరబూసినట్లు.. తొలకరికి వానల్లో మట్టి పరిమళం విస్తరించినట్టు.. వానాకాలం ముంగిట నిలిచిన రైతు సోదరులు ఈ ఏటి పంటల సాగు ప్రణాళికలతో తలమునకలై ఉన్నారు. Click Here

విత్తనాలు

 • ఏయే పంటలను ఎలా విత్తుకోవాలి?

  ‘అన్నపూర్ణ’ ప్రకృతి వ్యవసాయ పంటల నమూనా ప్రకారం కందకాలు, మట్టి పరుపులు, కాలువలు, పండ్ల మొక్కలకు గుంతలు తవ్వడం. Click Here

వరి

 • ప్రకృతి ఒడిలో సాగు పాఠాలు !

  పత్తి సాగులో బండ చాకిరీకి ‘బ్రష్ ఈజీ’ పరికరంతో చెక్ రూ. 100-150 ఖర్చుతో రైతులే తయారు చేసుకోవచ్చు పురుగుమందు పూత చాలా సులభం.. భారీగా కూలి ఖర్చు ఆదా Click Here

 • అతిసన్నని గింజ.. అన్నమెంతో నాణ్యం!

  ఆర్‌ఎన్‌ఆర్ 15048 వంగడం రూపకల్పనలో ముఖ్యపాత్ర పోషించి మార్గదర్శకత్వం నిర్వహించిన ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సురేంద్రరాజు రైతు సోదరులు పాటించాల్సిన మెలకువలను అందిస్తున్నారు. Click Here

 • రబీ వర్రీ

  కేంద్రం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం క్వింటాకు రూ. 1,280 వరకు చెల్లించాలి. అయితే రైతుల నుంచి రూ. వెయ్యికి మించి వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. ఈ విధంగా జిల్లా మొత్తంగా రైతులు రూ. 40 లక్షలు నష్టపోయారు. Click Here

 • అద్భుత వరి వంగడాల రూపశిల్పి

  జ్ఞానభాండాగారాలను తల దిండుగా పెట్టుకొని పెరిగిన వారు విసిరేసిన వెలివాడలో పుట్టిన మట్టి మనిషి దాదాజీ రాంజీ ఖోబ్రగడే. బతుకు మట్టికొట్టుకుపోయినా మట్టిని నమ్ముకొనే బతికిన వెలివాడ దళిత రైతు. మట్టి మీద ఆయనకున్న మమకారం అద్భుత ఆవిష్కరణలకు కారణమైంది. ఆ కృషి ఫలితమే ఇప్పుడు యావత్తు ఉత్తరాది కంచాల్లో వెదజల్లిన విరజాజి మొగ్గల్లా పరుచుకున్న అన్నం మెతుకులు. అవి ఖోబ్రగడే సృష్టించిన హెచ్‌ఎంటీ రకం బియ్యపు మెతుకులే. Click Here

 • ఆశల సాగుకు...

  పాలకులు పట్టించుకోకపోయినా వరుణుడు కరుణించాడు. జిల్లా వ్యాప్తంగా ఒక మోస్తరుగా వర్షాలు కురవడంతో అన్నదాతలు కోటి ఆశలతో ఖరీఫ్ సాగుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే బోర్ల కింద నారుమడులు పోసినవారు నాట్లకు సిద్ధమవుతున్నారు. కొన్నిచోట్ల నారుమడులు వాడుబట్టిన దశలో వర్షాలు కురవడంతో జీవం పోసుకున్నాయి. అన్నదాతల్లో ఆనందాన్ని నింపాయి.Click Here

సేంద్రీయ సేద్యం

 • ప్రకృతి సేద్యంతో సరికొత్త జీవితం!

  ధనాశతో పరుగెత్తే మనిషి సహజ జీవితం సాగించలేడంటారు తాత్వికులు. ఢిల్లీ మహానగరపు కాంక్రీట్ కీకారణ్యంలో డబ్బు యావతో పరుగులు పెట్టే యాంత్రిక మనుషులను చూసి ఆరు పదులు సాగే జీవితం మూడు పదులతో ముగుస్తుందని నిశ్చయానికొచ్చాడో యువ ఇంజనీరు. Click Here

 • ఫలించిన పచ్చని కల!

  కరువు పరిస్థితుల్లోనూ నిశ్చింతగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఆదర్శ రైతు గజ్జెల రమణారెడ్డి. వైఎస్సార్ జిల్లా లింగాల మండలం పెద్దకుడాల వాస్తవ్యుడైన రమణారెడ్డికి రైతుగా 30 ఏళ్ళ అనుభవం ఉంది. చాలా ఏళ్ళపాటు రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడి కష్టనష్టాల పాలైన ఆయన కొన్నేళ్ల క్రితం సేంద్రీయ వ్యవసాయం వైపు, రెండేళ్ల క్రితం పాలేకర్ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళి చక్కని ఫలితాలు సాధిస్తున్నారు. Click Here

 • సమగ్ర సాగుతో 50% అధికాదాయం!

  సమగ్ర సేంద్రియ సాగును ప్రోత్సహిస్తున్న తమిళనాడు వ్యవసాయ వర్సిటీ.. మాగాణి, మెట్టలోనూ అమలు * నేలకు సారం.. రైతుల కుటుంబాలకు పోషకాహారం Click Here

 • మొండి తెగుళ్లకు ‘జీవ’ చికిత్స!

  జీవామృతం, పంచగవ్య వంటి ప్రోబయోటిక్స్ వాడి, తక్కువ ఖర్చుతో కచ్చితమైన ఫలితాలు సాధించవచ్చని ప్రొ. శ్యాం సుందర్‌రెడ్డి స్పష్టం చేస్తున్నారు. అసాధారణ వాతావరణ పరిస్థితులుంటే తప్ప జీవామృతంతో ఈ తెగుళ్లు పత్తాలేకుండా పోతాయంటున్నారు. Click Here

 • ఆహార, ఆరోగ్య భద్రత!

  ప్రతి కుటుంబం వారికి సరిపడా సహజాహారాన్ని సురక్షితమైన ప్రకృతి విధానంలో సంపాదించుకోవడానికి అవకాశం ఉంది.అన్నపూర్ణ పంటల నమూనా ప్రకారం అరెకరంలో ఎవరికి వారే ప్రకృతి వ్యవసాయం చేసుకోవడం వల్ల వారి కుటుంబానికి అవసరమైన అన్ని రకాల ఆహార పదార్థాలు లభించడంతోపాటు శరీరానికి కావలసిన వ్యాయామం కూడా అందుతుంది Click Here

 • యువ సాయం

  ఈ యువకులు... అందరూ ఉన్నత విద్యావంతులే... మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన వారే... అరక దున్ని విత్తు నాటారు... ఆ గ్రామానికి కొత్తరూపు తెచ్చారు... పంటచేలకు పచ్చదనం తెచ్చారు... జీవితాల్లో పచ్చదనం నింపారు... వ్యవసాయం దండగ అన్న ఊరికి... యువ సాయం చేసిన యువకులు వీళ్లు. Click Here

 • ఆవున్న చోటే అన్నముంది!

  ఆరు ఆవులతో 28 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం.. భూమికి విశ్రాంతి కోసం దాళ్వా వరి సాగుకు ప్రతి ఏటా సెలవు! సార్వాలో మాత్రమే వరి సాగు.. వినియోగదారులకు నేరుగా ముడి బియ్యం అమ్మకం ద్వారా ఎకరానికి రూ. 40 వేల నికరాదాయం ఒక్కో దేశీ ఆవు ద్వారా రూ. 40 వేల సాగు ఖర్చులు ఆదా! Click Here

అరటి సాగు

 • ప్రకృతి సాగులో 'అమృతంఫలం'

  ఖర్చు తక్కువతో కచ్చితమైన నికరాదాయం పొందుతూ భూసారాన్ని కూడా పెంపొందించుకుంటూ రైతులోకానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు గుంటూరు జిల్లా నాదెండ్ల రైతులు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఈ అరటి రైతులు పండిస్తున్న నాణ్యమైన అరటి గెలలను వ్యాపారులు అధిక ధర చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారు. Click Here

వ్యవసాయ యంత్రాలు

 • నడ్డి విరిచే గొడ్డు చాకిరీకి స్వస్తి!

  పత్తి సాగులో బండ చాకిరీకి ‘బ్రష్ ఈజీ’ పరికరంతో చెక్ రూ. 100-150 ఖర్చుతో రైతులే తయారు చేసుకోవచ్చు పురుగుమందు పూత చాలా సులభం.. భారీగా కూలి ఖర్చు ఆదా Click Here

 • పరికరం ఒకటే.. పనులు మూడు!

  ఆరుతడి పంటల్లో కలుపు తీతకు యంత్రాన్ని తయారు చేసిన సృజనాత్మక రైతు విశ్వనాథం చెరకు, మిరప తదితర పంటలతోపాటు శ్రీవరి పొలాల్లో కలుపు తీతకు, గొప్పు తీయడానికీ అనుకూలం! Click Here

 • రైతన్న కష్టాలను తీర్చే వినూత్న పరికరాల'

  పంట పక్షుల పాలు పాలి కాపు అప్పుల పాలు’ అన్నారు పెద్దలు. ఈ మాటలు పక్షుల బెడద తీవ్రతను చెప్తున్నాయి . ప్రస్తుతం ఉన్న కూలీల కొరతతో పక్షులకు కాపలా కాయడం పెద్ద సమస్య. దీనికి పరిష్కారంగా ఆయన పక్షులను పారదోలే పరికరాన్ని రూపొందించాడు గిరీష్. వేసిన పంటను బట్టి దాన్ని పాడు చేసే పక్షులు, జంతువులను పారదోలేందుకు వాటి సహజ శత్రువుల ధ్వనిని రికార్డు చేసి ఒక మెమరీ కార్డులో అమర్చి పంట పొలంలో ఏర్పాటు చేస్తారు. అది సృష్టించే శబ్ధ తరంగాలతో పక్షులు, జంతువులు పారిపోతాయి. ఒక పరికరం రెండెకరాల మేరకు ప్రభావం చూపుతుంది. Click Here

వేరుశనగ

 • వేరుశనగ అన్ని ప్రాంతాల్లో విత్తుకోవచ్చు

  గత రెండు, మూడు రోజుల నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు పడ్డాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేస్తున్నది.వరి, పత్తి పంటల తర్వాత తెలుగు నాట ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే పంట వేరుశనగ. అన్ని ప్రాంతాల్లోనూ జూలై నెలలో వేరుశనగ విత్తుకోవచ్చు.కదిరి-5,6,9, అనంత, నారాయణి, వేమన, జేసీజీ-88, అభయ, ధరణి లాంటి రకాలు తక్కువ వర్షపాత ప్రాంతాల్లోను, గ్రీష్మ, రోహిణి, కాళహస్తి, టీజీ-26, టీఏజీ-24 లాంటి రకాలు ఎక్కువ వర్షపాత ప్రాంతాల్లో సాగుకు అనువైనవి. Click Here

పాడి పరిశ్రమ


 • గత రెండు, మూడు రోజుల నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు పడ్డాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేస్తున్నది.వరి, పత్తి పంటల తర్వాత తెలుగు నాట ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే పంట వేరుశనగ. అన్ని ప్రాంతాల్లోనూ జూలై నెలలో వేరుశనగ విత్తుకోవచ్చు.కదిరి-5,6,9, అనంత, నారాయణి, వేమన, జేసీజీ-88, అభయ, ధరణి లాంటి రకాలు తక్కువ వర్షపాత ప్రాంతాల్లోను, గ్రీష్మ, రోహిణి, కాళహస్తి, టీజీ-26, టీఏజీ-24 లాంటి రకాలు ఎక్కువ వర్షపాత ప్రాంతాల్లో సాగుకు అనువైనవి. Click Here

ఆక్వా

 • ‘ఆక్వా’లోనూ సేంద్రియ కెరటం!

  రసాయనాల వాడకం తక్కువ.. దిగుబడి ఎక్కువ! వెనామీ, చేపల చెరువుల్లో రసాయనిక ఎరువులు, ప్రోబయోటిక్స్‌కు బదులుగా జీవామృతం 90% తగ్గిన రసాయనిక ఎరువుల వాడకం.. ఖర్చు కూడా! పది రోజులు ముందుగానే పట్టుబడి.. మేత ఖర్చు ఆదా హెక్టారుకు 9-12 టన్నుల రొయ్యల దిగుబడి.. రసాయనాలు వాడిన చెరువుల్లో కన్నా 20% అధిక దిగుబడి Click Here

ఇతరములు

 • ఆకుపచ్చని భవిష్య నిధి!

  పంట దిగుబడి ఎంత తొందరగా చేతికొస్తే రైతుకు అంత ప్రయోజనం! అయితే, ఆరుగాలం చెమటోడ్చినా కాలం కలసి రాకనో, చేతికొచ్చిన దిగుబడికి ధర గిట్టుబాటు కాకనో.. రైతన్న పరిస్థితి ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్న చందంగానే మిగిలింది. కొద్ది నెలల్లో ఆదాయాన్నిచ్చే ఆహార/వాణిజ్య పంటల సాగుపైనే పూర్తిగా ఆధారపడటమే అత్యధిక అన్నదాతల దుస్థితికి ఒకానొక ముఖ్యకారణం! Click Here

Supported By :

nabardimg

Number of Visitors: statistics in vBulletin

Protected under trademark and copyright Act 1957.